నిజంనిప్పులాంటిది

Jan 25 2024, 13:20

Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై కేసు.. సీఐడీకి బదిలీ

గువాహటి: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అస్సాంలో నిర్వహించిన 'భారత్‌ జోడో న్యాయ యాత్ర'లో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే..

దీంతో రాహుల్‌ సహా ఇతర నేతలపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా దీన్ని సీఐడీ (CID)కి బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో సమగ్రమైన దర్యాప్తు కోసం కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు రాష్ట్ర డీజీ వెల్లడించారు..

ఇటీవల రాహుల్‌ యాత్ర గువాహటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఈ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ట్రాఫిక్‌ కారణాల దృష్ట్యా నగరంలో ఈ యాత్ర చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అందుకు బదులుగా బైపాస్‌ నుంచి వెళ్లాలని సూచించింది.

ఈ క్రమంలోనే యాత్ర నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టారు. అయితే, కాంగ్రెస్‌ కార్యకర్తలు వాటిని తోసుకుని ముందుకు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు, పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది.

సమూహాన్ని రాహుల్‌ రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. యాత్ర పేరుతో అస్సాంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాంగ్రెస్‌ ఉద్దేశమని.. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌ గాంధీని అరెస్టు చేస్తామని సీఎం పేర్కొన్నారు..

నిజంనిప్పులాంటిది

Jan 25 2024, 13:19

బడ్జెట్‌ 2024: కేంద్రం ఫోకస్‌ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2024-25ను సమర్పించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ సారి మధ్యంతర బడ్జెట్‌పై అచితూచి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది..

ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు పన్ను ప్రయోజనాల రూపంలో కొంత ఉపశమనాన్ని ప్రకటించాలని ప్రజలు భావిస్తున్నారు. ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణాన్ని ఎలా నియంత్రిస్తారు అనే దానిపై అందరి దృష్టి ఉంది. ఈ సారి బడ్జెట్‌లో వీటిపై నిర్ణయాలు తీసుకుంటే సామాన్యులకు మేలు జరుగుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

పన్ను స్లాబ్‌

ప్రస్తుత పన్ను స్లాబ్‌లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రూ.3 లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితి ఉంది. దీని అర్థం ఈ పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయవలసిన అవసరం లేదు. రాబోయే బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు..

ప్రామాణిక తగ్గింపు(స్టాండర్డ్ డిడక్షన్‌)

ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.1 లక్ష వరకు రెట్టింపు చేయాలని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న జీవన వ్యయం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కోసం ప్రామాణిక మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని వాదన కూడా ఉంది..

ఆర్థిక లోటు తగ్గింపు

భారత్‌ తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని 50.7 బేసిస్ పాయింట్ల మేర అంటే దాదాపు రూ.9.07 లక్షల కోట్లు తగ్గించుకోవచ్చని అంచనా. కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయాన్ని కొనసాగిస్తూ సంక్షేమ వ్యయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ఉపాధి, గృహనిర్మాణంపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈసారి మధ్యంతర బడ్జెట్‌ కావడంతో ఈమేరకు నిర్ణయాలపై కొంత సందిగ్ధం ఏర్పడనుందని కొందరు చెబుతున్నారు..

నిజంనిప్పులాంటిది

Jan 25 2024, 13:17

సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం కష్టమే: మంత్రి సీతక్క

వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామివారిని మంత్రి సీతక్కఈరోజు దర్శించుకు న్నారు.కుటుంబ సమేతంగా రాజన్న సన్నిధికి వచ్చిన మంత్రి సీతక్కకు ఆలయ అధికారులు, పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం మంత్రికి ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.ఆయలం వెలుపల మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ..

సర్పంచుల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం వీలుకాదన్నారు. ప్రతినెల మొదటి వారంలోనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు.

గత పాలకులు పదేండ్లపాటు సామాజిక మాధ్యమాల్లో ఉన్నది లేనట్టుగా చూపి కాలం గడిపారని విమర్శించారు. అందుకే ప్రజలు వారిని తిరస్కరించి తమకు అధికారం కట్టబెట్టారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు వస్తున్న ప్రజా ఆదరణను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తప్పుడు మాటలను ప్రజలు ఇక నమ్మని పరిస్థితి వచ్చిందని, సోషల్‌ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. సర్పంచుల వేల బిల్లులు పెండింగ్ పట్టిందెవరుని ప్రశ్నించారు. తాము సక్రమంగా పని చేస్తేనే మళ్లీ అధికారం ఇస్తారు, చేయకపోతే అవకాశం ఇవ్వరని తెలిపారు.

వేములవాడ రాజన్న తమ ఇలవేల్పని, కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటామన్నారు. ఆదివాసి కుటుంబంగా మాకు ఆనవాయితీ ఉంది.. సమ్మక్క జాతరకు ముందు వచ్చి దర్శించుకుంటాని చెప్పారు.

రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వం వివక్ష చూపిందని విమర్శించారు. తొందర్లోనే స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమ వుతారని చెప్పారు.

మన ఆచారాలు, సాంప్రదాయాలుకు అనుగుణంగా దేవుళ్లను కొలుచుకుంటాం, కానీ కొందరు ఈ దేవుళ్లనే కొలవాలని చెబుతూ వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మన సంస్కృతి సాంప్రదా యాలను చరిత్రను కాపాడుకొని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Jan 25 2024, 13:15

ఫిబ్రవరి నెలలో మంత్రులు ఎవరు అయోధ్యకు వెళ్లకూడదు: ప్రధాని

కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్లకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఇటీవలే ప్రాణప్రతిష్ట జరిగిన రామాలయానికి భారీ సంఖ్యలో భక్తులు, యాత్రికులు తరలివ స్తున్నారు.

దీనితో రద్దీని నియంత్రిం చేందు కు చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని అయోధ్య స్థానిక అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తమ మంత్రివర్గ సహచరులకు ప్రధాని నుంచి సంబంధిత విషయంలో బుధవారం సూచనలు వెలువడ్డాయి.

మంత్రులు తమ విఐపి, వివిఐపి హోదాలలో రద్దీ దశలో అయోధ్యకు వెళ్లితే తలెత్తే పరిస్థితిని దృష్టిలోతీసుకుని ప్రధాని మోడీ నుంచి ఈ విషయంలో ఆదేశాలు వెలువడినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరి వదిలేసి, మంత్రులు అయోధ్యకు మార్చి నెలలో వెళ్లవచ్చునని, అప్పటివర కూ తమ పర్యటన వాయిదా వేసుకోవాలని ప్రధాని కోరినట్లు వెల్లడించారు. బుధవారం కేంద్ర కేబినెట్ సమావే శం జరిగింది. ఈ దశలో అయోధ్యలో రామాలయంలో ప్రాణప్రతిష్ట, దీనిపై ప్రజాస్పందన గురించి మంత్రులను ప్రధాని ప్రశ్నించినట్లు వెల్లడైంది.

యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటోందని, దూర ప్రాంతాల నుంచి బాలరాముడిని చూసేందుకు జనం తరలివస్తున్నారని, విశేష స్పం దన ఉందని మంత్రులు ప్రధానికి వివరించినట్లు తెలిసింది. 22న రామాలయ ప్రాణప్రతిష్ట ఘట్టం ఘనంగా జరిగింది. ప్రధాన ఘట్టానికి ఆహ్వానితులుగా తరలివచ్చిన విశిష్టులు ఆ తరువాత ప్రత్యేకంగా బాలరాముడిని సందర్శించుకున్నారు.

మరుసటి రోజు మంగళవారం నుంచి దర్శనం సార్వత్రికం అయింది.తొలిరోజునే దాదాపు ఐదులక్షల మంది వరకూ దర్శనం చేసుకున్నారు. ఈ సంఖ్య ఈ వారాంతంలో మరింత పెరుగుతుందని, ఫిబ్రవరి అంతా కూడా ఇదే విధంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

మంళవారం తెల్లవారు జామున మూడు గంటలకు దర్శనానికి భక్తులు బారులు తీరారు. కాగా జనం కిక్కిరిసిన దశలో కొద్ది సేపు దర్శనం నిలిపివేయాల్సి వచ్చింది. ఆలయం ప్రాంగణం, అయోధ్యలో పలు ప్రాంతాలలో జనం కిక్కిరిసి ఉన్నారు. దీనితో పరిస్థితిని సమీక్షించుకుని అధికారులు రోజంతా అయోధ్యకు వచ్చే వాహనాలను శివార్లకు చాలా దూరంలోనే నిలిపివేశారు.

పరిస్థితిని సమీక్షించిన తరువాతనే ఈ వాహనాల ను అయోధ్యలోకి పంపించేందుకు వీలుం టుందని తెలిపారు. నెలరోజుల పాటు మంత్రులు, ఉన్నతా ధికారులు, సెలబ్రిటీలు ఎవరూ కూడా దర్శనానికి రాకుండా ఉండటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

ఈ విషయాన్ని ప్రధానికి తెలియచేయడంతో, దీనికి అనుగుణంగానే ప్రధాని ఇప్పుడు మంత్రులకు దీనిపై తగు సలహాలు వెలువరిం చినట్లు వెల్లడైంది.

నిజంనిప్పులాంటిది

Jan 25 2024, 10:37

హైదరాబాదులోనేడు ఇంగ్లాండ్ v/s భారత్ టెస్ట్ మ్యాచ్ సిరీస్

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

ఈ నెల 29 వరకు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

శాంతి భద్రతల పోలీసులతో పాటు ఆక్టోపస్, ట్రాఫిక్, ఆర్మ్డ్ ఫోర్స్, ఎస్ బీ, సీసీఎస్, ఎస్ఓటీ, ఐటీ సెల్ వంటి అన్ని ప్రత్యేక విభాగాల నుంచి 1,500 పోలీసు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు.

నిజంనిప్పులాంటిది

Jan 25 2024, 10:36

త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. జిల్లాలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేయనున్నట్టు.. హైదరాబాద్‌ జిల్లా ఇంఛార్జ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ బుధవారం కీలక ప్రకటన చేశారు.

జిల్లా అభివృద్ధి, సంక్షేమంతో పాటు పెండింగ్‌ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం ఈ ప్రకటన చేశారు. జిల్లాలో ఏడు ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు.

జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించనున్నట్టు తెలిపారు.జిల్లా అధివృద్ధిలో ప్రభుత్వం, అధికారులు కలిసి పని చేయాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో చేపల మార్కెట్లు కొత్తగా నిర్మించే ఆలోచన ఉందని మంత్రి పొన్నం వివరించారు. అవసరమైతే ప్రతి మండలంలో ఒక చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశించారు....

నిజంనిప్పులాంటిది

Jan 25 2024, 10:35

పల్నాడు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్య?

అంగన్ వాడీ సెంటర్ లో అంగన్ వాడీ కార్యకర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా శావల్య పురం మండలంలో బుధవారం సాయంత్రం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మతుకుమల్లి గ్రామంలోని చింతలపాడు బిసి కేంద్రంలో జ్యోతి ప్రసన్న అనే మహిళ అంగన్ వాడీ కార్యకర్తగా పని చేస్తుంది.

గత కొన్ని రోజుల నుంచి ఎపిలో అంగన్ వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు.సమ్మెను విరమించిన తరువాత బుధవారం ఆమె అంగన్ వాడీ కేంద్రానికి చేరుకొని పిల్లలకు పౌష్టికాహారం అందించారు.

సాయంత్రం నాలుగు గంటల తరువాత చిన్నారులను తీసుకొని వెళ్లాలని, సహాయకురాలికు సూచించారు. తనకు రికార్డులు రాసే పని ఉందని చెప్పారు.

రాత్రి 7.30 వరకు ఇంటికి రాకపోవడంతో ఆమె పిల్లలు, బంధువులు అంగన్ వాడీ కేంద్రం వద్దకు వెళ్లి చూడగా ఆమె ఉరేసు కున్నట్టు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Jan 25 2024, 10:33

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌, పశుసంవర్ధకశాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్‌ కుమార్‌, వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శిగా టీ వినయ్‌కృష్ణారెడ్డిని నియమించింది.

రోడ్లు భవనాలశాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్‌, టీఎస్‌ఐఆర్‌డీ సీఈవోగా పీ కాత్యా యనిదేవి, గనులశాఖ డైరెక్టర్‌గా సుశీల్‌ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది...

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 18:22

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురాశతో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు.

నిందితుడి వద్ద నుంచి గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎస్‌ఐ మల్లేష్‌ మీడియాకు విరాలను వెల్లడించారు. పెద్దపెల్లి పట్టణానికి చెందిన అన్సారీ అనే వ్యక్తి కష్టపడకుండా డబ్బులు సంపాందించాలని తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు.

ఇందుకోసం కాలేజీలు ఎక్కువగా ఉన్న ఏరియాలను టార్గెట్‌గా చేసుకొని ఉత్తరప్రదేశ్ నుంచి గంజాయి చాక్లెట్స్‌ తెప్పించి విక్రయిస్తున్నాడని తెలిపారు.

విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం పట్టణంలోని అమర్ నగర్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు...

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 18:21

తహసిల్దార్ యోగేశ్వరి దేవి సస్పెండ్

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఇంచార్జి, బత్తలపల్లి తహసీల్దార్ యోగేశ్వరి దేవిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఎస్సీ, ఎస్టీలకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూములను అధికార పార్టీ నేతలకు ఇష్టారాజ్యంగా కట్టబెట్టిందని తహశీల్దార్ పై వచ్చిన అవినీతి, అరోపణలపై జరిగిన సమగ్ర విచారణ అనంతరం తహశీల్దార్ యోగేశ్వరి దేవిని సస్పెండ్ చేస్తున్న‌ట్లు కలెక్టర్ పేర్కొన్నారు.